Breaking News

SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్‌

Published on Mon, 04/07/2025 - 08:39

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడ్డాయి. తమ హోం గ్రౌండ్‌లో (ఉప్పల్‌ స్టేడియం) జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో వారికిది వరుసగా నాలుగో ఓటమి. గుజరాత్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఓడి, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం అనంతరం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానాని​కి ఎగబాకింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్‌ చిట్టచివరి స్థానానికి పడిపోయింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు లోకల్‌ బాయ్‌ సిరాజ్‌ చుక్కలు చూపించాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (8), అభిషేక్‌ శర్మను (18) పవర్‌ ప్లేలోనే పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మరో డేంజర్‌ బ్యాటర్‌ అనికేత్‌ వర్మను (18) కూడా ఔట్‌ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 

సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్‌ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్‌రైజర్స్‌ అతి కష్టం మీద 152 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. ఆఖర్లో కమిన్స్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌ 17, నితీశ్‌ రెడ్డి 31, క్లాసెన్‌ 27, కమిందు 1, సిమర్‌జీత్‌ డకౌటయ్యారు. షమీ 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు తమ సహజ శైలికి భిన్నంగా జిడ్డుగా ఆడారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ కూడా ఆదిలో తడబడినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క గిల్‌ బాధ్యతాయుతంగా ఆడుతుంటే వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. 

సుందర్‌ ఔటయ్యాక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా గుజరాత్‌ మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌(5), జోస్‌ బట్లర్‌ (0) విఫలమయ్యారు. గుజరాత్‌ పవర్‌ ప్లేలోనే వీరిద్దరి వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో షమీ 2, కమిన్స్‌ ఓ వికెట్‌ తీశారు.

మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వికెట్‌ (పిచ్‌) చాలా కఠినంగా ఉండింది. మ్యాచ్‌ ఆరంభంలో వికెట్లు తీస్తే ఆటలోకి వచ్చినట్లే. బంతి ఎక్కువగా స్పిన్‌ కాలేదు. మంచు ప్రభావం కూడా ఉండింది. అయినా వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. వారి పేసర్లును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండింది.

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)