Breaking News

ట్రెంట్‌ బౌల్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ

Published on Fri, 05/02/2025 - 09:55

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్‌లో ఈ కివీ బౌలర్‌ 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన 36వ బౌలర్‌గా, మూడో న్యూజిలాండ్‌ బౌలర్‌గా (టిమ్‌ సౌథీ, ఐష్‌ సోధి తర్వాత) నిలిచాడు. బౌల్ట్‌ ఈ ఫార్మాట్‌లో 257 మ్యాచ్‌లు ఆడి 302 వికెట్లు తీశాడు. 

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (జైస్వాల్‌, నితీశ్‌ రాణా, జోఫ్రా ఆర్చర్‌) తీసిన బౌల్ట్‌ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

బౌల్ట్‌తో పాటు కర్ణ్‌ శర్మ (4-0-23-3), బుమ్రా (4-0-15-2), హార్దిక్‌ పాండ్యా (1-0-2-1), దీపక్‌ చాహర్‌ (2-0-13-1) కూడా సత్తా చాటడంతో ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతగా కాపాడుకోగలిగింది. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రికెల్టన్‌ (61), రోహిత్‌ (53), సూర్యకుమార్‌ (48 నాటౌట్‌), హార్దిక్‌ (48 నాటౌట్‌) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

భీకర ఫామ్‌లో బౌల్ట్‌
ఈ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బౌల్ట్‌.. గత ఐదు మ్యాచ్‌లుగా చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు తీసిన బౌల్ట్‌.. చివరి 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 11 వికెట్లు తీసి ఈ సీజన్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఈ సీజన్‌లో ముంబై వరుస విజయాల బాట పట్టడానికి బౌల్ట్‌ కూడా ఓ ప్రధాన కారకుడు. బౌల్ట్‌తో పాటు బుమ్రా, చాహర్‌ ఫామ్‌లోకి రావడంతోనే ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. బౌలర్లకు తోడు బ్యాటర్లు (రోహిత్‌, రికెల్టన్‌, స్కై) కూడా చెలరేగుతుండటంతో ముంబై తిరుగులేని విజయాలు సాధిస్తుంది.

ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌.. రాజస్తాన్‌ ఔట్‌
రాజస్థాన్‌పై గెలుపుతో ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ పరాజయంతో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది. రాజస్థాన్‌కు ముందు సీఎస్‌కే కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

టాప్‌లో రషీద్‌ ఖాన్‌
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉంది. రషీద్‌ 471 టీ20 మ్యాచ్‌ల్లో 641 వికెట్లు తీశాడు. రషీద్‌ తర్వాత డ్వేన్‌ బ్రావో (631), సునీల్‌ నరైన్‌ (584) అత్యధిక టీ20 వికెట్లు తీశారు. భారత్‌ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు చహల్‌ (377) పేరిట ఉంది. ​

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)