Breaking News

IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్‌ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!

Published on Wed, 04/30/2025 - 09:28

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఏ జట్టుకు అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. ఏ జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించలేదు. ఈ రేసులో ఆర్సీబీ అన్ని జట్ల కంటే కాస్త ముందుంది.

ఆ జట్టు ఇప్పటివరకు (ఏప్రిల్‌ 29) ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. పేరుకు ఆర్సీబీ టేబుల్‌ టాపర్‌గా ఉన్నా.. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం మిగిలిన తొమ్మిది జట్లతో పోటీపడాల్సిందే.

ప్రస్తుతం​ ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీ సహా మరో ఆరు జట్లు ముందు వరుసలో ఉన్నాయి. సీజన్‌ ప్రారంభంలో వరుస పరాజయాలతో సతమతమైన ముంబై ఇండియన్స్‌ ఆతర్వాత అనూహ్య విజయాలతో ప్లే ఆఫ్స్‌ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఆర్సీబీ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ పదింట ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఈ నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు కూడా ప్రధానంగా పోటీపడుతున్నాయి. పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో పంజాబ్‌కు ఓ పాయింట్ (మరో పాయింట్‌ కేకేఆర్‌కు) లభించింది. ప్లే ఆఫ్స్‌ రేసులో చివరికి ఈ ఒక్క పాయింట్‌ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.

పై ఏడు జట్లతో పాటు ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధానంగా ఉన్న మరో రెండు జట్లు లక్నో, కేకేఆర్‌. లక్నో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. లక్నో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం పోటీలో ఉన్న ఏడు జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్‌ మాత్రమే మైనస్‌లో (-0.325) ఉంది.

నిన్న ఢిల్లీపై అనూహ్య విజయంతో కేకేఆర్‌ కూడా ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో కేకేఆర్‌ పాయింట్ల సంఖ్య 9కి చేరింది. 

ప్రస్తుతానికి పైన పేర్కొన్న ఏడు జట్ల మధ్య నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీ జరుగుతుంది. అయితే పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో ఉన్న రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌, సీఎస్‌కే అవకాశాలను కూడా కొట్టి పారేయడానికి వీల్లేదు.

రాజస్థాన్‌ తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌పై సంచలన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో (6 పాయింట్లు) ఉంది.

ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న మరో జట్టు సన్‌రైజర్స్‌. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. రాజస్థాన్‌తో పోలిస్తే సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధించే అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు రాజస్థాన్‌ 10 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్‌ తొమ్మిదే ఆడింది. 

ఈ సీజన్‌లో అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించకపోయినా , ఏ మాత్రం అవకాశం లేని ఏకైక జట్టు సీఎస్‌కే . సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు తదుపరి ఆడాల్సిన 5 మ్యాచ్‌ల్లో గెలిచినా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండదు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)