Breaking News

IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌

Published on Mon, 05/26/2025 - 21:06

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్‌లో తొలిసారి 600 ప్లస్‌ మార్కును (605) తాకిన స్కై.. ప్రస్తుత సీజన్‌లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటాడు. 

ముంబై ఇండియన్స్‌ చరిత్రలో (ఐపీఎల్‌లో) స్కై కాకుండా క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే ఓసారి 600 ప్లస్‌ పరుగులు స్కోర్‌ చేశాడు. సచిన్‌ 2010 సీజన్‌లో 618 పరుగులు సాధించాడు.

ఓ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
619* - సూర్యకుమార్ యాదవ్ (2025)
618 - సచిన్ టెండూల్కర్ (2010)
605 - సూర్యకుమార్ యాదవ్ (2023)
553 - సచిన్ టెండూల్కర్ (2011)
540 - లెండిల్ సిమన్స్ (2015)
538 - రోహిత్ శర్మ (2013)

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 600 పరుగుల మార్కును దాటాడు. ఈ మ్యాచ్‌లో 44 పరుగుల వద్ద (16 ఓవర్ల తర్వాత) బ్యాటింగ్‌ చేస్తున్న స్కై.. ఈ సీజన్‌లో 14వ సారి 25 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఓ బ్యాటర్‌ ఇన్ని సార్లు (ఒకే సీజన్‌లో) 25 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 2018 సీజన్‌లో కేన్‌ విలియమ్సన్‌, 2023 సీజన్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 13 సార్లు ఈ ఘనత సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న  ముంబై ఇండియన్స్‌ 16.3 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ 44, నమన్‌ ధిర్‌ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 27, రోహిత్‌ శర్మ 24, తిలక్‌ వర్మ 1, విల్‌ జాక్స్‌ 17 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో జన్సెన్‌, విజయ్‌కుమార్‌  వైశాఖ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్‌ బ్రార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)