Breaking News

అదే మా కొంప‌ముంచింది.. లేదంటే విజ‌యం మాదే: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌

Published on Sun, 03/30/2025 - 21:02

ఐపీఎల్‌-2025లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేలవ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. తొలి మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై  విజ‌యం సాధించిన ఎస్ఆర్‌హెచ్‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఓట‌ముల‌ను చ‌విచూసింది. తాజాగా వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ప‌రాజ‌యం పాలైంది. 

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్‌ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌(32), హెడ్‌(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధిం‍చారు. 

అనంత‌రం బౌలింగ్‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ తేలిపోయింది. 164 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జాక్ ఫ్రెజ‌ర్ మెక్‌గ‌ర్క్‌(38), అభిషేక్ పోరెల్‌(34) రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంత‌రం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల‌మ్యే త‌మ ఓట‌మికి కార‌ణ‌మ‌ని క‌మ్మిన్స్ చెప్పుకొచ్చాడు.

"మేము అన్ని విభాగాల్లో విఫ‌ల‌మ‌య్యాము. తొలుత స్కోర్ బోర్డులో త‌గన‌న్ని ప‌రుగులు ఉంచ‌లేక‌పోయాము. కొన్ని త‌ప్పు షాట్లు ఆడి మా వికెట్ల‌ను కోల్పోయాము. డీప్‌లో క్యాచ్‌లు అందుకోవడం ఈ ఫార్మాట్‌లో సర్వ సాధారణమే. ఇదే మా ఓట‌మికి కార‌ణమ‌ని నేను అనుకోను. గత రెండు మ్యాచ్‌ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. క‌చ్చితంగా ఈ ఓట‌ముల‌పై స‌మీక్ష చేస్తాము. 

మాకు అందుబాటులో ఉన్న అప్ష‌న్స్‌ను ప‌రిశీలిస్తాము. అనికేత్ వ‌ర్మ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌కు కూడా డొమాస్టిక్ క్రికెట్‌లో అత‌డు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రని ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఇక్క‌డ కొన‌సాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెష‌న్స్‌లో కూడా అత‌డు త‌న బ్యాటింగ్‌తో మైమ‌రిపించాడు. 

ఈ రెండు ఓట‌ముల‌పై మేము పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌డం లేదు. ఈ టోర్నీలో మాకు  ఇంకా  చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. త‌దుప‌రి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామ‌ని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేష‌న్‌లో క‌మ్మిన్స్ పేర్కొన్నాడు.
చ‌ద‌వండి: IPL 2025: స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)