Breaking News

రిటైర్మెంట్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ధోని

Published on Sun, 04/06/2025 - 18:40

ఐపీఎల్‌-2025 త‌ర్వాత టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని  అన్ని ఫార్మాట్‌ల‌కు విడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. శ‌నివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదిక‌గా సీఎస్‌కే-ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు ధోని తల్లిదండ్రులు స్టేడియంకు వ‌చ్చారు. దీంతో ఢిల్లీ మ్యాచ్ అనంత‌రం ధోని రిటైర్ కానున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

కానీ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ధోని ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇప్పుడు చేయ‌క‌పోయినా సీజ‌న్ అనంత‌రం మాత్రం ధోని క‌చ్చితంగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పునున్నాడ‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా త‌న రిటైర్మెంట్ వార్త‌ల‌పై మిస్ట‌ర్ కూల్ స్పందించాడు. ఐపీఎల్‌-2026లో ఆడాలా వ‌ద్దా అన్న‌ దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధోని చెప్పుకొచ్చాడు.

"నేను ఇంకా ఐపీఎల్‌లో ఆడుతున్నా. ప్ర‌తీ ఏడాది స‌మీక్షించకున్నాకే ఐపీఎల్‌లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వ‌స్తాయి. త‌దుప‌రి సీజ‌న్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్‌ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శ‌రీరం స‌హ‌క‌రిస్తోంద‌న‌పిస్తే క‌చ్చితంగా వ‌చ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ధోని పేర్కొన్నాడు.

కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ధోనికి ఎక్కువ‌గా బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికి త‌న మార్క్‌ను మాత్రం చూపించ‌లేక‌పోతున్నాడు. 4 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 76 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంతేకాకుండా త‌న జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానుల‌కు విసుగు తెప్పిస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే ధోని రిటైర్ అయ్యి కొత్త ఆట‌గాళ్లకు అవ‌కాశ‌మివ్వాల‌ని ప‌లువ‌రు మాజీలు కూడా అభిప్రాయప‌డుతున్నారు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే జ‌ట్టు సైతం తీవ్ర నిరాశ‌ప‌రుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట సీఎస్‌కే ఓట‌మి పాలైంది. చెన్నై త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 8న చంఢీగడ్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)