IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌

Published on Mon, 06/02/2025 - 14:58

ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఓ సింగిల్‌ సీజన్‌లో 700 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన తొలి ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌గా, ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

నిన్న (జూన్‌ 1) పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌తో కలుపుకొని స్కై ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 167.92 స్ట్రయిక్‌రేట్‌తో 65.18 సగటున, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 717 పరుగులు చేశాడు. స్కై ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సూర్యకుమార్‌ తర్వాత ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. సచిన్‌ 2010 సీజన్‌లో 618 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో స్కై సచిన్‌ రికార్డును అధిగమించాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-6 ఆటగాళ్లు..
సాయి సుదర్శన్‌-15 మ్యాచ్‌ల్లో 759  పరుగులు
సూర్యకుమార్‌ యాదవ్‌- 16 మ్యాచ్‌ల్లో 717 పరుగులు
శుభ్‌మన్‌ గిల్‌-15 మ్యాచ్‌ల్లో 650 పరుగులు
మిచెల్‌ మార్ష్‌- 13 మ్యాచ్‌ల్లో 627 పరుగులు
విరాట్‌ కోహ్లి-14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు
శ్రేయస్‌ అయ్యర్‌-16 మ్యాచ్‌ల్లో 603 పరుగులు

ఈ సీజన్‌లో స్కై మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. వరుసగా 16 ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేశాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎవరూ వరుసగా ఇన్ని ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేయలేదు. స్కై తర్వాత అత్యధికంగా రాబిన్‌ ఉతప్ప వరుసగా 10 ఇన్నింగ్స్‌ల్లో 25 ప్లస్‌ స్కోర్లు చేశాడు (2014లో కేకేఆర్‌ తరఫున). స్కై, ఉతప్ప తర్వాత సాయి సుదర్శన్‌ (9, 2023-24, గుజరాత్‌), విరాట్‌ కోహ్లి (9, 2024-25, ఆర్సీబీ) అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో (వరుసగా) ఈ ఘనత సాధించారు.

ఈ సీజన్‌లో స్కై చేసిన పరుగులు (తాజా ఇన్నింగ్స్‌తో మొదలు)..
44 (26), 33 (20), 57 (39), 73 నాటౌట్‌ (43), 24 (35), 48 నాటౌట్‌ (23), 54 (28), 40 నాటౌట్‌ (19), 68 నాటౌట్‌ (30), 26 (15), 40 (28), 28 (26), 67 (43), 27 నాటౌట్‌ (9), 48 (28), 29 (26)

ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో 700 ప్లస్‌ పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్‌ కోహ్లి-973 (2016)
శుభ్‌మన్‌ గిల్‌-890 (2023)
జోస్‌ బట్లర్‌-863 (2022)
డేవిడ్‌ వార్నర్‌-848 (2016)
సాయి సుదర్శన్‌-759 (2025)
విరాట్‌ కోహ్లి-741 (2024)
కేన్‌ విలియమ్సన్‌-735 (2018)
క్రిస్‌ గేల్‌-733 (2012)
మైక్‌ హస్సీ-733 (2013)
డుప్లెసిస్‌-730 (2023)
సూర్యకుమార్‌ యాదవ్‌-717 (2025)
క్రిస్‌ గేల్‌-708 (2013)

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ చెలరేగినా ముంబై ఇండియన్స్‌ ప్రయాణం క్వాలిఫయర్‌-2లోనే ముగిసింది. నిన్న (జూన్‌ 1) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో పరాజయంపాలై లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో స్కై విలువైన ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు. 

బ్యాటింగ్‌లో సత్తా చాటినా ముంబై బౌలర్లు 203 పరుగుల స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోలేకపోయారు. శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో పంజాబ్‌ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకుంటుంది.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)