IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్‌ యాదవ్‌

Published on Wed, 05/21/2025 - 20:33

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత​ కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.

9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్‌ (25), రోహిత్‌ శర్మ (5), విల్‌ జాక్స్‌ (21) ఔట్‌ కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (13), తిలక్‌ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌, ముస్తాఫిజుర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.

కుల్దీప్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రికెల్టన్‌ వికెట్‌ తీయడంతో కుల్దీప్‌ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్‌ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్‌-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్‌ మిశ్రా, రషీద్‌ ఖాన్‌, వరుణ్‌ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 ​మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్‌ (84 మ్యాచ్‌లు), సునీల్‌ నరైన్‌ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.

ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఇలా..
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు (గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్‌ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.

ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది.

ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్‌ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. 
 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)