Breaking News

IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌

Published on Fri, 04/18/2025 - 18:45

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్‌ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్‌, కమిన్స్‌ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 40, ట్రవిస్‌ హెడ్‌ 28, ఇషాన్‌ కిషన్‌ 2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19, క్లాసెన్‌ 37, అనికేత్‌ 18 (నాటౌట్‌), కమిన్స్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, బౌల్ట్‌, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 31, రోహిత్‌ శర్మ 26, విల్‌ జాక్స్‌ 36, సూర్యకుమార్ యాదవ్‌ 26, హార్దిక్‌‌ 21, తిలక్‌ 17 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

సన్‌రైజర్స్‌ బౌలర్లలో కమిన్స్‌ 3, ఎషాన్‌ మలింగ 2, హర్షల్‌ పటేల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్‌ జాక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌
ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.

ఐపీఎల్‌లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..
ముంబై ఇండియన్స్‌- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)
కేకేఆర్‌- ఈడెన్‌ గార్డెన్స్‌- 28 (40)
రాజస్థాన్‌ రాయల్స్‌- సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం- 24 (31)
ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఉప్పల్‌ స్టేడియం- 21 (32)
సీఎస్‌కే- చెపాక్‌ స్టేడియం- 20 (31)
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)