Breaking News

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై

Published on Wed, 05/21/2025 - 23:21

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్‌ మిగిలుండగానే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.

ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. 

ముకేశ్‌ కుమార్‌, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 25, రోహిత్‌ శర్మ 5, విల్‌ జాక్స్‌ 21, తిలక్‌ వర్మ 27, హార్దిక్‌ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు​ మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్‌, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌, చాహర్‌, జాక్స్‌, కర్ణ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్‌ రిజ్వి (39) టాప్‌ స్కోరర్‌ కాగా.. విప్రాజ్‌ నిగమ్‌ (20), అశుతోష్‌ శర్మ (18), కేఎల్‌ రాహుల్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)