వాషింగ్టన్‌ సుందర్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!

Published on Mon, 11/25/2024 - 16:14

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు ఐపీఎల్‌ మెగా వేలం-2025లో షాక్‌ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్‌లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బిడ్‌  వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.

ఈ క్రమంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రంగంలోకి దిగగా.. గుజరాత్‌ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్‌ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్‌ సుందర్‌ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.

మూడు జట్లకు
క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలో 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. 

సన్‌రైజర్స్‌కు మొత్తంగా 18 మ్యాచ్‌లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో వాషింగ్టన్‌ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు ఆడి 378 రన్స్‌ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)