Breaking News

ఆరెంజ్‌ ఆర్మీ హార్ట్‌బ్రేక్‌.. కావ్యా మేడమ్‌ ఇలా ఎందుకు చేసింది!

Published on Mon, 11/25/2024 - 16:54

ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బంధం తెగిపోయింది. ఐపీఎల్‌ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ భువీని వదిలేసింది.

అయితే, కనీసం రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్‌రైజర్స్‌ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.

ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్‌లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.

అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.

సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ అనుబంధం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువనేశ్వర్‌ కుమార్‌ 2011లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. తొలి సీజన్‌లో పుణె వారియర్స్‌(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ను.. 2014లో సన్‌రైజర్స్‌ దక్కించుకుంది.

సన్‌రైజర్స్‌ ను చాంపియన్‌గా నిలపడంలో కీలకం
రైజర్స్‌ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.  ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్‌ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.

ఆరెంజ్‌ ఆర్మీ హార్ట్‌బ్రేక్‌.. కావ్యా మేడమ్‌ ఇలా ఎందుకు చేసింది!
దీంతో ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్‌ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్‌ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్‌ కంటే కూడా.. భువీ- సన్‌రైజర్స్‌ బ్రేకప్‌తోనే నేను ఎక్కువగా హర్ట్‌ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్‌ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.

చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్‌ కెప్టెన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)