Breaking News

ఐపీఎల్‌లోనూ విజృంభిస్తా.. ఢిల్లీకి టైటిల్‌ అందించడమే లక్ష్యం: కరుణ్‌ నాయర్‌

Published on Tue, 03/18/2025 - 08:52

దేశవాళీల్లో పరుగుల వరద పారించిన సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లోనూ అదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 18వ సీజన్‌లో కరుణ్‌ నాయర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది విజయ్‌ హజారే వన్డే టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన కరుణ్‌ నాయర్‌ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. 

ఇక రంజీ ట్రోఫీలోనూ అదే జోష్‌ కొనసాగిస్తూ 57.33 సగటు 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు.

‘చాన్నాళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నా. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కిందపడ్డ ప్రతిసారీ అంతకు రెట్టింపు బలంతో పైకి లేవడానికి ప్రయత్నించా. ప్రస్తుతానికి ఐపీఎల్‌ మీదే దృష్టి పెట్టా. జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లో టీమ్‌ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఢిల్లీ జట్టుతో చేరడం ఆనందంగా ఉంది. ప్రతి మ్యాచ్‌... కెరీర్‌లో చివరిది అనే విధంగానే కష్టపడతా.

ఢిల్లీ కొత్త కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. ఇటీవలి కాలంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక కేఎల్‌ రాహుల్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అతడి కెరీర్‌ ఆరంభం నుంచి దగ్గర నుంచి గమనించా. తిరిగి వాళ్లతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నా. క్యాపిటల్స్‌కు తొలిసారి కప్పు అందించేందుకు ప్రయత్నిస్తా’ అని నాయర్‌ అన్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)