Breaking News

IPL 2025: ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌ పాండ్యాకు భారీ షాకిచ్చిన బీసీసీఐ

Published on Mon, 06/02/2025 - 18:01

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (జూన్‌ 1) జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ముంబై ఇంటికి, పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. జూన్‌ 3న జరుగనున్న ఫైనల్లో పంజాబ్‌.. ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ కూడా అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.

కాగా, ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్‌లోని సభ్యులందరికీ కూడా 50 శాతం (రూ. 12 లక్షలు) మ్యాచ్‌ ఫీజ్‌ జరిమానాగా పడింది.

ఈ సీజన్‌లో రూల్స్‌ మారడంతో హార్దిక్‌ సస్పెన్షన్‌ ను​ంచి తప్పించుకున్నాడు. ఈ సీజన్‌కు ముందు వరకు ఓ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేస్తే ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించేవారు.  

ఇదే మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా జరిమానా పడింది. ఈ సీజన్‌లో రెండోసారి స్లో ఓవ‌ర్ రేట్‌ మెయింటైన్‌ చేయడంతో రూ.24 ల‌క్ష‌ల ఫైన్ విధించారు. పంజాబ్‌ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధిస్తారు) కోత విధించారు.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (29 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (18 బంతుల్లో 37; 7 ఫోర్లు) దంచేశారు. 

అజ్మ తుల్లా ఒమర్జాయ్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి గెలిచింది. నాయకుడు శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 87 నాటౌట్‌; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా నడిపించాడు. నేహల్‌ వధేరా (29 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.    

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)