Breaking News

IPL 2025: గత మూడు ఫైనల్స్‌లో విరాట్‌ కోహ్లి ఎలా ఆడాడో చూడండి..!

Published on Mon, 06/02/2025 - 19:46

ఐపీఎల్‌ 2025 సీజన్‌ చివరి అంకానికి చేరింది. నిన్న (జూన్‌ 1) జరిగిన క్వాలిఫయర్‌-2తో ఫైనల్స్‌ రెండో బెర్త్‌ దక్కించుకున్న జట్టేదో తేలిపోయింది. ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి పంజాబ్‌ కింగ్స్‌ 11 ఏళ్ల తర్వాత (2014 తర్వాత) ఫైనల్స్‌కు చేరింది. 

మరోవైపు ఆర్సీబీ క్వాలిఫయర్‌-1లో విజయంతో (పంజాబ్‌పై) నేరుగా ఫైనల్స్‌కు (తొమ్మిదేళ్ల తర్వాత) చేరింది. ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్స్‌ (2009, 2011, 2016, 2025) అవుతుంది. పంజాబ్‌, ఆర్సీబీ జట్లకు ఇప్పటివరకు ఫైనల్స్‌ ఆడిన అనుభవం ఉన్నా ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. ఈ  సీజన్‌లో ఏ జట్టు టైటిల్‌ గెలిచినా ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ వస్తుంది.

ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో ఓ విషయం గురించి తెలుసుకునేందుకు ఆర్సీబీ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. గత మూడు ఫైనల్స్‌లో​ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎలా ఆడాడన్నదే వారి ఆతృత. 

2009 సీజన్‌లో ఆర్సీబీ తొలి ఫైనల్స్‌ ఆడగా.. అందులో అప్పటి నవయువకుడు విరాట్‌ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఆండ్రూ సైమండ్స్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ డెక్కన్‌ ఛార్జర్స్‌ చేతిలో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఆర్సీబీ రెండో సారి ఫైనల్స్‌కు చేరింది 2011 సీజన్‌లో. ఆ సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ నాటి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కేతో తలపడింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ 32 బంతుల్లో 35 పరుగులు చేసి సురేశ్‌ రైనా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఆర్సీబీ మూడో సారి ఫైనల్‌కు చేరింది 2016 సీజన్‌లో. ఆ సీజన్‌లో విరాట్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ సీజన్‌లో 900 పరుగుల క్లబ్‌లో చేరిన విరాట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన ఫైనల్లో మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో) చెలరేగాడు. అయినా ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని మూడోసారి టైటిల్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 

ఆ మ్యాచ్‌లో విరాట్‌, గేల్‌ (76) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. తాజాగా ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. మరి ఈ సీజన్‌లో విరాట్‌ ఎన్ని పరుగులు సాధిస్తాడో, ఆర్సీబీ టైటిల్‌ కలను సాకారం చేసుకుంటుందో లేదో చూడాలి. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)