Breaking News

IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...

Published on Mon, 05/13/2024 - 06:06

బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్‌’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. 

రజత్‌ పటిదార్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్‌ జాక్స్‌ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన అక్షర్‌ పటేల్‌ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు.  

పటిదార్‌ ఫటాఫట్‌... 
డుప్లెసిస్‌ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్‌ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్‌ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్‌ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్‌ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహిపాల్‌ సిక్స్‌లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్‌సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది.  

అక్షర్‌ ఒక్కడే! 
లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్‌ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్‌ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తర్వాత కెపె్టన్‌ అక్షర్‌ పటేల్‌ 
ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్‌ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు.  

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) అభిõÙక్‌ (బి) ఇషాంత్‌ 27; డుప్లెసిస్‌ (సి) ఫ్రేజర్‌ (బి) ముకేశ్‌ 6; జాక్స్‌ (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 41; పటిదార్‌ (సి) అక్షర్‌ (బి) రసిఖ్‌ 52; గ్రీన్‌ (నాటౌట్‌) 32; మహిపాల్‌ (సి) అభిషేక్‌ (బి) ఖలీల్‌ 13; దినేశ్‌ కార్తీక్‌ (సి) కుల్దీప్‌ (బి) ఖలీల్‌ 0; స్వప్నిల్‌ (సి) కుషాగ్ర (బి) రసిఖ్‌ 0; కరణ్‌ శర్మ (రనౌట్‌) 6; సిరాజ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్‌: ఇషాంత్‌ 3–0–31–1, ఖలీల్‌ 4–0–31–2, ముకేశ్‌ 3–0–23–1, అక్షర్‌ 3–0–24–0, కుల్దీప్‌ 4–0–52–1, రసిఖ్‌ 3–0–23–2. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) జాక్స్‌ (బి) స్వప్నిల్‌ 1; ఫ్రేజర్‌ (రనౌట్‌) 21; అభిõÙక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) యశ్‌ 2; షై హోప్‌ (సి) కరణ్‌ (బి) ఫెర్గూసన్‌ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 2; అక్షర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) యశ్‌ 57; స్టబ్స్‌ (రనౌట్‌) 3; రసిఖ్‌ (సి) జాక్స్‌ (బి) గ్రీన్‌ 10; కుల్దీప్‌ (బి) యశ్‌ 6; ముకేశ్‌ (సి) మహిపాల్‌ (బి) ఫెర్గూసన్‌ 3; ఇషాంత్‌ శర్మ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్‌: స్వప్నిల్‌ 1–0–9–1, సిరాజ్‌ 4–0–28–1, యశ్‌ దయాళ్‌ 3.1–0–20–3, కరణ్‌ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్‌ 4–0–23–2, గ్రీన్‌ 4–0–19–1, జాక్స్‌ 1–0–16–0.  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)