Breaking News

IPL 2024: కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ షాక్‌.. జరిమానాతో పాటు నిషేధం

Published on Tue, 04/30/2024 - 18:17

కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్‌ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్‌లో రాణా రెండోసారి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం కూడా పడింది. 

ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్‌  ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్‌ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 

రాణా కొద్ది రోజుల కిందట ​కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేశాక ఓవరాక్షన్‌ (ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. 

ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కేకేఆర్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 

అంతకుముందు కేకేఆర్‌ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్‌ యాదవ్‌ (35 నాటౌట్‌) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)