Breaking News

IPL 2024 GT Vs SRH: లేటు వయసులో ఇరగదీస్తున్న మోహిత్‌ శర్మ

Published on Sun, 03/31/2024 - 17:52

గుజరాత్‌ టైటాన్స్‌ వెటరన్‌ పేసర్‌ మోహిత్‌ శర్మ 35 ఏళ్ల లేటు వయసులో ఇరగదీస్తున్నాడు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా సొంత మైదానంలో సన్‌రైజర్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో మోహిత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో మరింత చెలరేగిన మోహిత్‌.. ఆ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లలో మోహిత్‌ అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ సీజన్‌లో గుజరాత్‌ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నింటిలో మోహిత్‌ సూపర్‌ బౌలింగ్‌తో (చివరి ఓవర్లలో) ఆకట్టుకున్నాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మోహిత్‌.. ఆతర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా చివరి రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చాడు.

ప్రస్తుతం సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ మోహిత్‌ అదే తరహాలో బౌలింగ్‌ చేసి తన కోటా చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుత సీజన్‌లో మోహిత్‌ ప్రదర్శన చూసి గుజరాత్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్‌ మాస్టర్‌ క్లాస్‌ బౌలర్‌ అంటూ కితాబునిస్తున్నారు. 

కాగా, సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. మయాంక్‌ అగర్వాల్‌ 16, హెడ్‌ 19, అభిషేక్‌ శర్మ 29, మార్క్రమ్‌ 17, క్లాసెన్‌ 24, షాబాజ్‌ అహ్మద్‌ 22, అబ్దుల్‌ సమద్‌ 29, వాషింగ్టన్‌ సుందర్‌ డకౌటయ్యారు. 

గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్‌ చేసి జోరు మీదుండిన సన్‌రైజర్స్‌కు అడ్డుకట్ట వేశారు. మోహిత్‌ శర్మ 3, ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగుల మార్కును క్రాస్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో నామమాత్రపు స్కోర్‌కు పరిమితం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. 

163 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వృద్దిమాన్‌ సాహా (25) ఔటయ్యాడు. గిల్‌కు (11) జతగా సాయి సుదర్శన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 45/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవాలంటే 90 బంతుల్లో 118 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)