Breaking News

IPL 2024: స్టార్‌ పేసర్‌ అవుట్‌.. నయా సంచలనం ఎంట్రీ

Published on Fri, 03/15/2024 - 10:52

ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి తాజా సీజన్‌ నుంచి తప్పుకొన్నాడు. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్‌ మొత్తానికి ఎంగిడి దూరం కానున్నాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌తో లుంగి ఎంగిడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ భర్తీ చేసింది. ఈ నియామకానికి  సంబంధించి ఫ్రాంఛైజీ ప్రకటన విడుదల చేసింది.

కాగా 21 ఏళ్ల హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాటర్‌ మెగర్క్‌.. లెగ్‌ స్పిన్నర్‌ కూడా! మెల్‌బోర్న్‌కు చెందిన అతడు.. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు చేయగలిగాడు.

ఇక ఎంగిడి మడిమ నొప్పి కారణంగా క్యాపిటల్స్‌కు దూరం కావడంతో.. రూ. 50 లక్షల ధర(రిజర్వ్‌ ప్రైస్‌)కు యాజమాన్యం జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ను జట్టులో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సైతం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఐపీఎల్‌-2024 సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆఖరికి అతడు ఇలా హ్యాండిచ్చాడు. తాజాగా ఎంగిడి(రూ. 50 లక్షలు) కూడా దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ మార్చి 22 నుంచి ఆరంభం కానుండగా.. క్యాపిటల్స్‌ మార్చి 23న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2024- RCB: విరాట్‌ కోహ్లి లేకుండానే.. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు