Breaking News

IPL 2024 DC VS MI: ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన వుడ్‌

Published on Sat, 04/27/2024 - 17:35

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. తొలుత జేక్‌ ఫ్రేసర్‌ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు), ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్‌. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ పోరెల్‌ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్‌), రిషబ్‌ పంత్‌ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (6 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో లూక్‌ వుడ్‌, బుమ్రా, పియూశ్‌ చావ్లా, నబీ తలో వికెట్‌ పడగొట్టారు. 

ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఊచకోత
లూక్‌ వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ ఓవర్‌లో స్టబ్స్‌ ఐదు బౌండీరలు, ఓ సిక్సర్‌ కొట్టి (4,4,6,4,4,4) 26 పరుగులు పిండుకున్నాడు. స్టబ్స్‌ ధాటికి కేవలం రెండో మ్యాచ్‌ ఆడుతున్న వుడ్‌ బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన వుడ్‌ ఓ వికెట్‌ తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఫలితంగా వుడ్‌ ఐపీఎల్‌ చరిత్రలో ఐదో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాల రికార్డు మోహిత్‌ శర్మ పేరిట నమోదై ఉంది. మోహిత్‌ ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)