కసిగా ఉన్నట్లున్నాడు.. కెమెరాలు బద్దలైపోతున్నాయి

Published on Tue, 03/28/2023 - 10:04

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ మంచి కసి మీద ఉన్నట్లున్నాడు. తన తొలి ఐపీఎల్‌ ఆడడం కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న రూట్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రూట్‌ ఒక్కసారి కూడా ఐపీఎల్‌లో పాల్గొనలేదు.

కనీస ధర రూ. కోటికే రాజస్తాన్‌కు అమ్ముడుపోయిన రూట్‌ తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  ఇప్పటివరకు 32 టి20లు ఆడిన రూట్‌ 126 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. అత్యు‍త్తమ స్కోరు 90గా ఉంది.ఇటీవలే అబుదాబి వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20లో రూట్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్‌ చేసి టి20 క్రికెటర్‌గా తాను పనికివస్తానని చెప్పకనే చెప్పాడు.

ఇక ప్రాక్టీస్‌లో భాగంగా రూట్‌ కొట్టిన బంతి కెమెరాను బ్రేక్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్‌ తన సిగ్నేచర్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడగా.. బంతి నేరుగా కెమెరాను తాకడంతో అది ముక్కలయింది. ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌.. ''26.03.2023.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున జో రూట్‌ ఫస్ట్‌బాల్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జాస్‌ బట్లర్‌(863 పరుగులు) తన కెరీర్‌లోనే సూపర్‌ఫామ్‌ కనబరచడంతో సంజూ శాంసన్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఖంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!

Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం

Videos

ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు

వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..

Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan

ఈఎంఐల్లో లంచాలు

సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

రేవంత్ రెడ్డికి చెక్ ?.. తెలంగాణలో కర్ణాటక ఫార్ములా

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ

కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

ఇంత దారుణమా..

వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటే దాడి.. ఏపీలో దాడులపై షర్మిలా రెడ్డి ఫైర్

Photos

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)

+5

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)