Breaking News

IPL 2023: సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ మ్యాచ్‌.. గెలిచిందా నిలుస్తుంది..!

Published on Thu, 05/18/2023 - 12:14

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఇవాళ (మే 18) మరో కీలక మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆర్సీబీ ఓడిందా.. ఢిల్లీ (అధికారికంగా ఔట్‌), సన్‌రైజర్స్‌, పంజాబ్‌, కేకేఆర్‌ (ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా లేనట్లే) బాటలోనే ప్లే ఆఫ్స్‌కు చేరకుండా లీగ్‌ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.

నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడినా మరో అవకాశం ఉంటుంది. అయితే మే 21న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పటికీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి. రేపు (మే 19) జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్‌, మే 20న జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై సీఎస్‌కే, కేకేఆర్‌పై లక్నో, మే 21న (మధ్యాహ్నం) జరిగే మ్యాచ్‌లో  సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఓడితే అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

అప్పటికి కూడా నెట్‌ రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. గుజరాత్‌పై ఆర్సీబీ సాధారణ విజయం సాధించినా ముంబైతో సమానంగా ఇరు జట్ల ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు గుజరాత్‌ (18), సీఎస్‌కే (17), లక్నో (17)లతో పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలిచినా.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలిచినా.. ఢిల్లీ చేతిలో సీఎస్‌కే, కేకేఆర్‌ చేతిలో లక్నో ఓడినా సమీకరణలన్నీ మారిపోతాయి. అప్పుడు 2, 3, 4 స్థానాల కోసం సీఎస్‌కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్‌ జట్లు పోటీపడాల్సి ఉంటుంది. నెగిటివ్‌ రన్‌రేట్‌ కారణంగా 12 పాయింట్లు ఉన్నప్పటికీ కేకేఆర్‌, పంజాబ్‌ జట్లు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే.

చ‌దవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)