Breaking News

MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!

Published on Sun, 05/21/2023 - 17:54

గత రెండు సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ, అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మయాంక్‌ అగర్వాల్‌ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో మనోడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవలి కాలంలో మయాంక్‌ ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇదే తొలిసారి. మయాంక్‌​కు జతగా మరో ఓపెనర్‌ వివ్రాంత్‌ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!
గతేడాది పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌  పంచన చేరిన మయాంక్‌కు ముంబై ఇండియన్స్‌ అంటే పూనకం వస్తుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన అతను 9 మ్యాచ్‌ల్లో 187 పరుగులు చేస్తే.. ముంబైతో ఇవాళ్టి మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. 17 పరుగుల తేడాతో ఐపీఎల్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్‌ చేసుకున్న మయాంక్‌.. 2022 సీజన్‌ నుంచి ముంబైపై విరుచుకుపడుతున్నాడు.

ఈ మధ్యలో ముంబైతో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 153.78 స్ట్రయిక్‌ రేట్‌తో 61 సగటున 183 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే సమయంలో (గత రెండు ఐపీఎల్‌ సీజన్లు) ఇతర జట్లతో 19 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌.. 112.75 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 14.89  సగటున 283 పరుగులు చేశాడు. ఇందులో కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు. ఈ గణాంకాలు చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. ముంబై అంటే మయాంక్‌ ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2023లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌.. నామమాత్రపు మ్యాచ్‌లో ఇవాళ ముంబైతో తలపడుతుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ అడుతున్న ముంబైకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి. గుజరాత్‌ (18),సీఎస్‌కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో ప్లేస్‌ కోసం ముంబై, రాజస్థాన్‌, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.

చదవండి: SRH VS MI: రికార్డులు కొల్లగొట్టిన సన్‌రైజర్స్‌ యువ ఓపెనర్‌

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)