Breaking News

గాయపడ్డ ఆర్సీబీ ఆటగాడి స్థానంలో సఫారీ ప్లేయర్‌

Published on Fri, 04/07/2023 - 14:02

బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ​ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ రీస్‌ టాప్లే స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేసింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం. టాప్లే స్థానంలో మరో పేసర్‌నే ఎంచుకుంది ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌. టాప్లే ప్లేస్‌లో సఫారీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ వేన్‌ పార్నెల్‌ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. టాప్లే సీజన్‌ మొత్తానికే దూరం కావడంతో పార్నెల్‌ ఎంపిక అనివార్యమైంది.

ఈ ఏడాది జరిగిన వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన పార్నెల్‌ను ఆర్సీబీ 75 లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. పార్నెల్‌ మరో వారంలో జట్టుతో చేరతాడని ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌ సంజయ్‌ బాంగర్‌ తెలిపాడు.

కాగా, ఈ సీజన్‌లో ఇప్పటికే గాయాల కారణంగా ముగ్గురు ఆర్సీబీ ఆటగాళ్లు (జోష్‌ హేజిల్‌వుడ్‌, రజత్‌ పాటిదార్‌, విల్‌ జాక్స్‌) సీజన్‌ మొత్తానికే దూరం కాగా.. తాజాగా టాప్లే వారి సరసన చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయంపాలైన ఆర్సీబీకి గాయాల బెడద పెద్ద తలనొప్పిగా మారింది. 


 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)