Breaking News

IPL 2023: గాయంపై అప్‌డేట్‌! బాంబు పేల్చిన మాక్స్‌వెల్‌..!

Published on Sat, 03/25/2023 - 14:20

IPL 2023- RCB- Glenn Maxwell: స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌-2022 ముగిసిన తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌. మెల్‌బోర్న్‌లో బర్త్‌డే పార్టీకి వెళ్లిన సమయంలో యాక్సిడెంట్‌కు గురైన మాక్సీ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఇటీవల టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ భాగమయ్యాడు.

ఇక ఇప్పుడు ఐపీఎల్‌-2023కి కూడా మాక్స్‌వెల్‌ అందుబాటులోకి వచ్చాడు. అయితే, తను గాయం నుంచి పూర్తి కోలుకోలేదంటూ బాంబు పేల్చాడీ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌. ‘‘పర్లేదు కాళ్లు బాగానే ఉన్నాయి. అయితే వందశాతం ఫిట్‌నెస్‌ సాధించాలంటే ఇంకొన్ని నెలలు పడుతుంది. ఏదేమైనా అంతా సజావుగా సాగి.. టోర్నమెంట్‌ మొత్తం బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆర్సీబీ సొంతమైదానం (బెంగళూరు)లో ఆడనుండటం సంతోషంగా ఉందన్న మాక్స్‌వెల్‌.. త్వరలోనే చిన్నస్వామి స్టేడియంలో కలుస్తానంటూ ఫ్యాన్స్‌ను చీర్‌ చేశాడు. కాగా 2022 సీజన్‌లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 13 మ్యాచ్‌లలో 301 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక గత సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌నకు చేరిన విషయం తెలిసిందే.

ఇక ఈసారి కూడా మాక్సీ మెరుపులు చూడాలని ఆశపడుతున్న అభిమానులను.. మాక్స్‌వెల్‌ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వెంటాడుతోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టుతో చేరిన మాక్స్‌వెల్‌ ప్రస్తుతం తన ప్రాక్టీసు కొనసాగిస్తున్నాడు. ఇక టీమిండియాతో వన్డే సిరీస్‌లో మాక్స్‌వెల్‌కు ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాగా 8 పరుగులు చేశాడు. 

చదవండి: NZ Vs SL: వారెవ్వా షిప్లే.. దెబ్బకు వికెట్‌ ఎగిరి అంతదూరాన పడింది! షాక్‌లో నిసాంక! వీడియో వైరల్‌

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)