Breaking News

ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా చరిత్ర

Published on Mon, 05/29/2023 - 22:30

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ యంగ్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు.


Photo: IPL Twitter

అయితే సాయి సుదర్శన్‌ తన  ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి  అసలు సమయంలో తనలోని డేంజరస్‌ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్‌ మార్చిన సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ వేసిన తుషార్‌ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్‌ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్‌.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు.


Photo: IPL Twitter

► ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్‌ పాండే 2014 ఐపీఎల్‌ ఫైనల్లో కేకేఆర్‌ తరపున పంజాబ్‌ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్‌కేపై కేకేఆర్‌ తరపున మన్విందర్‌ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్‌ పాటిదార్‌(ఆర్‌సీబీ తరపున 112 నాటౌట్‌ వర్సెస్‌ కేకేఆర్‌) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్‌ మ్యాచ్‌ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్‌ సెంచరీ చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్‌ దక్కించుకున్నాడు.


Photo: IPL Twitter

► ఇక ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్‌ వాట్సన్‌ 117 పరుగులు నాటౌట్‌(2018లో ఎస్‌ఆర్‌హెచ్‌తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్‌కే తరపున వృద్ధిమాన్‌ సాహా 115 పరుగులు పంజాబ్‌ కింగ్స్‌ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్‌ 95 పరుగులు(సీఎస్‌కే), మనీష్‌ పాండే(94 పరుగులు, కేకేఆర్‌) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

► ఐపీఎల్‌ ఫైనల్లో 50 ప్లస్‌ స్కోరు చేసిన రెండో యంగెస్ట్‌ బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ నిలిచాడు. ఇవాళ సీఎస్‌కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తొలి స్థానంలో మనన్‌ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్‌ గిల్‌  22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్‌ తరపున) మూడో స్థానంలో, రిషబ్‌ పంత్‌ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు.  

చదవండి:  శుబ్‌మన్‌ గిల్‌ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)