Breaking News

IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్‌ సోమవారానికి వాయిదా

Published on Sun, 05/28/2023 - 19:19

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్‌ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్‌ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్‌ రిఫరీ సైమన్‌ డౌల్‌.. అంపైర్లతో చర్చించి మ్యాచ్‌ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.

ఇక సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్‌ ఓవర్‌ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి లీగ్‌ స్టేజీలో గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం
ఐపీఎల్ 16వ సీజ‌న్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్లో సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కానుంది.

► ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌కు వేళైంది. విజేత ఎవ‌రో మ‌రికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్, ప‌దోసారి ఫైన‌ల్ చేరిన చెన్నై సూప‌ర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మ‌దాబాద్ స్టేడియం వేదిక‌గా ఇరుజ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. దాంతో, పాండ్యా సేన‌ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి క‌ప్పును ఎగ‌రేసుకుపోతుందా? అనే ఆస‌క్తి అందరిలో మొద‌లైంది.


 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)