Breaking News

ఎందరు వచ్చినా ధోనికే సాధ్యమైన వేళ.. సీఎస్‌కే తరపున

Published on Sat, 04/01/2023 - 17:21

ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. వద్దన్న రికార్డులు వెల్లువలా వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ఎంఎస్‌ ధోని మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.


Photo: IPL Twitter

అయితే ధోని మాత్రం సిక్సర్ల విషయంలో ఒక రికార్డు అందుకున్నాడు. సీఎస్‌కే తరపున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో భాగంగా జోష్‌ లిటిల్‌ బౌలింగ్‌లో డీప్‌స్వ్కేర్‌లెగ్‌ దిశగా కళ్లు చెదిరే సిక్సర్‌ బాదాడు. ధోని ఖాతాలో ఇది 230వ సిక్సర్‌ కాగా.. సీఎస్‌కే తరపున 200వ సిక్సర్‌. ఐపీఎల్‌ చరిత్రలో ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.


Photo: IPL Twitter

ఇంతకముందు ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో క్రిస్‌ గేల్‌(ఆర్‌సీబీ-239 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్‌(ఆర్‌సీబీ-238 సిక్సర్లు), కీరన్‌ పొలార్డ్‌(223 సిక్సర్లు- ముంబై ఇండియన్స్‌), విరాట్‌ కోహ్లి(218 సిక్సర్లు-ఆర్‌సీబీ)లు ఉన్నారు. తాజాగా ధోని(200 సిక్సర్లు- సీఎస్‌కే) వీరి సరసన నిలిచాడు.ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో ధోని ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ధోనికి ఎవరు కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ముంబై ఇండియన్స్‌ తరపున కీరన్‌ పొలార్డ్‌ 33 సిక్సర్లతో ధోనికి చాలా దూరంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌లో ఏడు బంతుల్లో 14 పరుగులు చేసిన ధోని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ ఉన్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది. సీఎస్‌కే విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌ (63) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చే​ర్చాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)