Breaking News

DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్‌రౌండర్‌ లేడు.. ఓడినా పర్లేదు..!

Published on Sun, 04/30/2023 - 08:04

Mitchell Marsh: ఐపీఎల్‌-2023లో భాగంగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్‌ 29 రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఆసీస్‌ స్పీడ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ తొలుత బంతి (4-1-27-4)తో, ఆతర్వాత బ్యాట్‌ (39 బంతుల్లో 63; ఫోర్‌, 6 సిక్సర్లు)తో వీరవిహారం చేసినప్పటికీ.. అతని జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ ఓడినప్పటికీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసినందుకు మార్ష్‌కే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఫ్రాంచైజీలకతీతంగా మార్ష్‌ ప్రదర్శనపై మనసు పారేసుకున్న అభిమానులు అతన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. మార్ష్‌ నామస్మరణతో ట్విటర్‌ మార్మోగిపోతుంది. ఆల్‌రౌండర్‌ అంటే ఇలా ఉండాలి (ఆడాలి).. ఇలాంటి వాడు జట్టుకు ఒక్కడుంటే చాలు.. ఓడినా ఢిల్లీనే గెలిచింది అంటూ కామెంట్లు చేస్తూ మార్ష్‌ను ఆకాశానికెత్తుతున్నారు. క్రికెట్‌ ప్రపంచం చాలామంది ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను చూసింది, కానీ ఇలాంటి నిఖార్సైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూడటం ఇదే మొదటిసారని కొనియాడుతున్నారు.

నిప్పులు చెరిగే వేగం, బంతిని ఇరు వైపుల స్వింగ్‌ చేయగల సామర్థ్యం, పేస్‌లో వేరియేషన్స్‌.. ఇలా స్పెషలిస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌కు ఇండాల్సిన లక్షణాలన్నీ మార్ష్‌ బౌలింగ్‌లో చూశామని, అలాగే పర్ఫెక్ట్‌ టీ20 బ్యాటర్‌కు ఉండాల్సిన క్వాలిటీస్‌ ఇవేనని (పవర్‌ హిట్టింగ్‌, ఐ కాంటాక్ట్‌, చెత్త బంతులను అంచనా వేయడం) మార్ష్‌ నిన్నటి ఇన్నింగ్స్‌లో చూపెట్టాడని చర్చించుకుంటున్నారు. ఢిల్లీ ఓడినా పర్లేదని, అసలుసిసలు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూసే అవకాశం దక్కిందని అంటున్నారు.

తన జట్టును గెలిపించేందుకు మార్ష్‌ చేయాల్సిదంతా చేశాడని, జట్టులో ఇతర సభ్యుల సహకారం లేకపోవడం వల్ల, అలాగే ఛేదన సమయంలో పిచ్‌ నెమ్మదించడం వల్ల ఢిల్లీ ఓడిందని అభిప్రాయపడుతున్నారు. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ అక్షర్‌ పటేల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపకపోవడం వల్ల డీసీ తగిన మూల్యం చెల్లించుకుందని, సాల్ట్‌ అద్భుతంగా ఆడాడని అంటున్నారు.  

ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు అద్భుతమని, అభిషేక్‌ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్‌), క్లాసెన్‌ (27 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోరుల, 4 సిక్సర్లు) అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడారని ప్రశంసిస్తున్నారు. సన్‌రైజర్స్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే (4-0-20-2).. జోరుమీద ఉన్న ఫిల్‌ సాల్ట్‌ (59)ను ఔట్‌ చేసి తమ జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడని, అతనికి నటరాజన్‌ (4-0-31-1) నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు.

కాగా,  ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమైంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)