Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. చరిత్ర సృష్టించనున్న విరాట్‌ కోహ్లి

Published on Sat, 05/06/2023 - 12:16

ఐపీఎల్‌-2023లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య ఇవాళ (మే 6) రాత్రి 7: 30 గంటలకు జరుగనున్న మ్యాచ్‌లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 6988 పరుగులు (232 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్‌ ధవన్‌ (6536), డేవిడ్‌ వార్నర్‌ (6189), రోహిత్‌ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. 

చదవండి: CSK VS MI: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్‌ శర్మ

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో (9 మ్యాచ్‌ల్లో 364 పరుగులు, 5 ఫిఫ్టీలు) ఉన్న విరాట్‌ కోహ్లికి ఢిల్లీతో మ్యాచ్‌లోనే 7000 పరుగుల మార్కును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఐపీఎల్‌-2023 50వ మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని అందుకోగలిగితే, అతనికి ఈ మ్యాచ్‌లో చిరకాలం గుర్తుండిపోతుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే విషయంలోనూ ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా ఉన్నందున, కోహ్లి సైతం ఈ మ్యాచ్‌లో శక్తి మేరకు రాణించాలని ఆశిస్తాడు.

ఆర్సీబీ ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (-0.030) కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే ఏకంగా 3 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ప్లేస్‌కు (ముంబై చేతిలో చెన్నై ఓడితే) ఎగబాకుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్‌ టాప్‌లో (14 పాయింట్లు) ఉండగా.. లక్నో (11 పాయింట్లు, 0.639) రెండులో, సీఎస్‌కే (11 పాయింట్లు, 0.329) మూడులో, రాజస్థాన్‌ (10 పాయింట్లు, 0.448) నాలుగో స్థానంలో ఉన్నాయి.  

చదవండి: DC Vs RCB: విరాట్‌ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)