Breaking News

IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌! 17 కోట్ల ‘ఆల్‌రౌండర్‌’ దూరం?!

Published on Tue, 01/03/2023 - 16:19

IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్‌ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్‌గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్‌ చేస్తాడని సమాచారం.

ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ ఆడకపోతే మాత్రం ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ నుంచి బౌలింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

వేలికి గాయం!
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ చేశాడు. 

అనంతరం ఎక్స్‌రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్‌తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్‌ తర్వాత ఆసీస్‌.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. 

గాయం ఇబ్బంది పెడితే..
ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గ్రీన్‌ గనుక టెస్టు సిరీస్‌ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్‌కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్‌లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్‌ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు.

చదవండి: Ind Vs SL: రుతురాజ్‌, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌.. గిల్‌ అరంగేట్రం! 
IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)