కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
IPL 2022 Auction: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
Published on Thu, 11/25/2021 - 10:59
IPL 2022 Auction: KL Rahul Likely to Lead Lucknow Franchise in Upcoming IPL Details: రెండు కొత్త జట్ల రాకతో ఐపీఎల్-2022 సరికొత్త శోభను సంతరించుకోనుంది. లక్నో, అహ్మదాబాద్ జట్లు వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌కు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక మెగా వేలానికి సర్వం సిద్ధమవుతున్న తరుణంలో ఏ ఫ్రాంఛైజీ ఏ ఆటగాడిని రీటైన్ చేసుకుంటుంది? కొత్త జట్ల కెప్టెన్లుగా ఎవరు ఉండబోతున్నారనే అంశం చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్... ఆ జట్టును వీడనున్నాడని... లక్నోకు అతడు సారథ్యం వహించబోతున్నాడనేది వాటి సారాంశం. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ అయిన రాహుల్‌తో లక్నో ఫ్రాంఛైజీ ఒప్పందం చేసుకోనుందని, మూడు సీజన్ల పాటు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల రాహుల్ ముంబై ఇండియన్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవడంతో అతడు ఎంఐకి ఆడనున్నాడంటూ ఊహాగానాలు వెలువడ్డ సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేలంలో అందుబాటులోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు లక్నో ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాంఛైజీ వర్గాలు కేఎల్ రాహుల్‌ను సంప్రదించాయని, ఇందుకు అతడు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. కాగా రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్ లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్ డాలర్లు) వెచ్చించి లక్నో టీమ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కేఎల్ రాహులే ఎందుకు?
►టీ20 ఫార్మాట్‌లో రాహుల్‌కు మంచి రికార్డు ఉంది.
►టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఇటీవలే ఎంపికయ్యాడు.
►మిగతా ఆటగాళ్లతో పోలిస్తే ఐపీఎల్‌లోనూ రాహుల్ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.
►నాలుగు సీజన్లలో 550కి పైగా పరుగులు సాధించిన రాహుల్.. 4 సార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
►వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టుకు అదనపు బలం.
►ఐపీఎల్-2021 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లో రాహుల్ 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్. ఇక అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునేది వీళ్లనే..!
Ravichandran Ashwin: నాతో పాటు అతడిని కూడా ఢిల్లీ ఫ్రాంఛైజీ రీటైన్ చేసుకోదు.. ఎందుకంటే!
Tags : 1