Breaking News

WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్‌! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్‌ సెలక్టర్‌

Published on Fri, 09/22/2023 - 15:42

ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్‌-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్‌ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. 

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్‌.. స్పిన్‌ దళంలో ఒకడిగా తప్పక టీమ్‌లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఇమాద్‌ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం
‘‘చాలా రోజులుగా ఇమాద్‌ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవాల్సిందే. 

అందుకే అతడికి చోటు లేదు
డొమెస్టిక్‌ క్రికెట్‌లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్‌ క్రైటీరియా’’ అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్‌ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్‌ వసీం జూనియర్‌ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు.

అనూహ్య రీతిలో ఉస్మా మీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడుతున్న ఇమాద్‌ వసీం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్‌ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్‌.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు.

చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్‌.. వీడియో వైరల్‌! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)