Breaking News

కివీస్‌తో సెమీస్‌.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్‌ ప్లేయర్‌

Published on Tue, 03/04/2025 - 13:48

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 సెకెండ్ సెమీఫైన‌ల్లో బుధ‌వారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్‌ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. లహోర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ కీల‌క పోరులో గెలిచి ఫైన‌ల్ దూసుకెళ్లాలని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. సౌతాఫ్రికా త‌మ గ్రూపు స్టేజిని ఆజేయంగా ముగించగా.. కివీస్ త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో భార‌త్ చేతిలో ఓట‌మిపాలైంది.

కాగా సెమీస్ పోరుకు ముందు సౌతాఫ్రికాను ఆట‌గాళ్ల ఫిట్‌నెస్ స‌మ‌స్య వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌కు అనారోగ్యం కార‌ణంగా దూర‌మైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, స్టార్ ఓపెన‌ర్  టోనీ డి జోర్జి ఇంకా పూర్తిగా కోలుకోపోయిన‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ఐడైన్ మార్‌క్ర‌మ్ సైతం తొడ‌కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. 

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మార్‌క్ర‌మ్ తొడ కండరాలు ప‌ట్టేశాయి. దీంతో ఫీల్డింగ్ మ‌ధ్యలోనే ఐడైన్ మైదానాన్ని వీడాడు. అత‌డి స్ధానంలో హెన్రిచ్ క్లాసెన్ కెప్టెన్సీ బాధ్యతలను చేప‌ట్టాడు. అయితే మార్‌క్ర‌మ్‌కు మార్చి 4న ప్రోటీస్ వైద్య బృందం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనుంది. 

ఒకవేళ ఈ ఫిట్‌నెస్ పరీక్షలో మార్‌క్రమ్‌​ ఫెయిల్ అయితే కివీస్‌తో సెమీస్‌కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో ఆల్‌రౌండ‌ర్ జార్జ్ లిండేను సౌతాఫ్రికా క్రికెట్  బోర్డు రిజర్వ్ జాబితాలో చేర్చిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అతడు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా లిండేకు అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20లో కూడా అతడు అదరగొట్టాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు.
చదవండి: అత‌డికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్క‌లు చూపిస్తాడు: అశ్విన్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)