ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. భార‌త జ‌ట్టు ఓట‌మి

Published on Sun, 09/14/2025 - 21:29

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ వ‌న్డే సిరీస్‌ను భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మితో ఆరంభించింది. ఆదివారం ముల్లాన్‌పుర్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో 8 వికెట్ల తేడాతో హ‌ర్మాన్ సేన ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.

టీమిండియా బ్యాట‌ర్ల‌లో ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో స‌త్తాచాట‌గా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ (57 బంతుల్లో 54) కూడా హాఫ్‌ సెంచరీతో రాణించింది. ఆసీస్‌ బౌలర్లలో మేగన్‌ షట్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్‌ గార్త్‌, అన్నాబెల్‌ సదర్‌లాండ్‌, అలనా కింగ్‌, తాహిలా మెగ్రాత్ త‌లా వికెట్ సాధించారు.

అదరగొట్టిన మూనీ, లిచ్‌ఫీల్డ్‌
అనంతరం 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.1 ఓవర్లలోనే చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫోబీ లిచ్‌ఫీల్డ్‌(80 బంతుల్లో 14 ఫోర్లతో 88), బెత్‌మూనీ(74 బంతుల్లో 9 ఫోర్లతో 77 నాటౌట్‌), సదర్లాండ్‌(51 బంతుల్లో 54 నాటౌట్‌) అద్భుతమైన హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్‌, స్నేహ్‌ రాణా ఒక్కో వికెట్‌ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్‌17న ముల్లాన్‌పుర్‌ వేదికగానే జరగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)