అదానీతో గుకేశ్‌ భేటీ

Published on Fri, 01/03/2025 - 03:54

న్యూఢిల్లీ: టీనేజ్‌లోనే ప్రపంచ క్లాసికల్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో భేటీ అయ్యాడు. తల్లిదండ్రులు పద్మావతి, డాక్టర్‌ రజనీకాంత్‌లతో కలిసి గుకేశ్‌ అహ్మదాబాద్‌లో అదానీని కలిశాడు. ‘ప్రపంచ చెస్‌ చాంపియన్‌ను ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతని విజయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి వారితో నాకు ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది. 

18 ఏళ్ల భారత కుర్రాడు ప్రపంచ చెస్‌లో సత్తా చాటుకున్నాడు. మన యువతరానికి ప్రేరణగా నిలిచాడు. దశాబ్దాలపాటు చెస్‌లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు గట్టి పునాది వేశాడు. అతని ఆత్మవిశ్వాసం, విజయం అద్భుతం. జై హింద్‌’ అని ‘ఎక్స్‌’లో గౌతమ్‌ అదానీ పోస్ట్‌ చేశారు. సింగపూర్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌లో గుకేశ్‌... చైనాకు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. అప్పుడు సోషల్‌ మీడియా వేదికగా గుకేశ్‌ను అదానీ ప్రశంసించారు. 

అదానీకి చెందిన స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ భారత గ్రాండ్‌మాస్టర్స్‌ ప్రజ్ఞానంద, అతని సోదరి వైశాలిలను స్పాన్సర్‌ చేస్తోంది. 1985లో 22 ఏళ్ల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గ్యారీ కాస్పరోవ్‌ రికార్డును తాజాగా గుకేశ్‌ చెరిపేశాడు. చెస్‌ ఒలింపియాడ్‌లోనూ భారత్‌ స్వర్ణం గెలిచేందుకు కీలకపాత్ర పోషించిన అతని ప్రదర్శనను గుర్తించిన భారత ప్రభుత్వం  ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేసింది. 

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)