Breaking News

పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు

Published on Sat, 04/27/2024 - 00:58

బాలి: ఇండోనేసియా టీనేజ్‌ బౌలర్‌ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో 17 ఏళ్ల స్పిన్నర్‌ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్‌ బౌలర్‌ ఫ్రెడరిక్‌ ఓవర్‌డిక్‌ (7/3) ఫ్రాన్స్‌పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. 

మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్‌ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్‌ (0), అనుజిన్‌ (0), నమూంజుల్‌ (0), నరంజెరెల్‌ (0), ఎన్‌క్జుల్‌ (0) ఖాతానే తెరవలేకపోయారు.   
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)