Breaking News

ముచ్చటగా మూడోసారి పీవీ సింధు

Published on Sat, 10/11/2025 - 15:56

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (PV Sindhu)... బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య (BWF) అథ్లెట్స్‌ కమిషన్‌లో మూడోసారి చోటు దక్కించుకుంది. 2025 నుంచి 2029 నవంబర్‌ వరకుగానూ బీడబ్ల్యూఎఫ్‌ శుక్రవారం సభ్యుల పేర్లను వెల్లడించింది. సింధు 2017 నుంచి కమిషన్‌లో కొనసాగుతోంది. 

ఇక 2020 బీడబ్ల్యూఎఫ్‌ సమగ్రత అంబాసిడర్‌గానూ ఉంది. తాజాగా అన్‌ సె యంగ్‌ (కొరియా), దోహా హానీ (ఈజిప్ట్‌), జియా యి ఫ్యాన్‌ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్‌)తో కలిసి సింధు అథ్లెట్స్‌ కమిషన్‌కు ఎంపికైంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే
‘బీడబ్ల్యూఎఫ్‌నకు అథ్లెట్లే కీలకం. మేం తీసుకునే ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే పడుతుంది. బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌... ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు దోహదపడుతుంది. కొత్త సభ్యులకు శుభాకాంక్షలు. వీరి చేరికతో కమిషన్‌ మరింత బలోపేతం అవుతుంది. 

మనందరం కలిసి బ్యాడ్మింటన్‌ను ప్రపంచంలోని ప్రముఖ క్రీడల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలి. భవిష్యత్తు కార్యచరణ రూపొందించడంలో వారి సహకారాన్ని ఆశిస్తున్నాము’ అని బీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు ఖున్‌యింగ్‌ పటామా లీస్వాడ్రకుల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

అథ్లెట్స్‌ కమిషన్‌ బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌కు సంప్రదింపుల సంస్థగా పనిచేస్తుంది. టోర్నమెంట్‌ల నియమ నిబంధనలు, అథ్లెట్ల సంక్షేమం, అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఎదురయ్యే సవాళ్లు ఇలా పలు కీలక అంశాలపై కమిషన్‌ సూచనలు చేయనుంది. 

ప్రస్తుతం కమిషన్‌లో ఐదుగురు సభ్యులు ఉండగా... కో అప్షన్‌ మెంబర్‌ను ఎంపిక చేయడం ద్వారా ఆ సంఖ్యను ఆరుకు పెంపొందించుకునే అవకాశం బీడబ్ల్యూఎఫ్‌నకు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషన్‌... త్వరలో చైర్మన్‌ను ఎన్నిక చేసుకోనుంది.    

ఇదీ చదవండి: 
భారత జట్టులో శ్రీజ, స్నేహిత్‌ 
భువనేశ్వర్‌: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ నెల 15 వరకు భువనేశ్వర్‌ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సురావజ్జుల స్నేహిత్‌ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 

వీరితో పాటు స్టార్‌ ప్లేయర్లు మనికా బత్రా, దియా చిటాలే, స్వస్తిక ఘోష్, మానవ్‌ ఠక్కర్‌ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య, ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ యూనియన్, భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి. 

చైనా, జపాన్, కొరియా, చైనీస్‌ తైపీ, బంగ్లాదేశ్‌ సహా మొత్తం 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టు 2026లో లండన్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించనుంది. 

భారత జట్టు: మహిళల విభాగం: ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలే, యశస్విని, స్వస్తిక ఘోష్‌. 
పురుషుల విభాగం: మానవ్‌ ఠక్కర్, మనుశ్‌ షా, స్నేహిత్, అంకుర్‌ భట్టాచార్య, పాయస్‌ జైన్‌.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)