Breaking News

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత!

Published on Tue, 08/22/2023 - 07:18

బకూ (అజర్‌బైజాన్‌): భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద 3.5–2.5తో గెలుపొందాడు. ఫైనల్‌ చేరడంద్వారా ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్‌ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు.

దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. నిరీ్ణత రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిశాక ప్రజ్ఞానంద, కరువానా 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 2–2తో సమమైంది.

అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో గెలిచాడు. ఫైనల్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో కరువానా ‘డ్రా’ చేసుకోవడంతో ప్రజ్ఞానంద విజయం ఖరారైంది. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో ప్రజ్ఞానంద ఫైనల్లో తలపడతాడు. రెండు క్లాసికల్‌ గేమ్‌లలో భాగంగా వీరిద్దరి మధ్య తొలి గేమ్‌ నేడు జరుగుతుంది.
చదవండి: Asia Cup 2023: రాహుల్, శ్రేయస్‌ పునరాగమనం    

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)