Breaking News

నగాల్‌కు చుక్కెదురు

Published on Thu, 10/03/2024 - 03:44

న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ ఏటీపీ–1000 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌కు నిరాశ ఎదురైంది. నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడ్డ 27 ఏళ్ల నగాల్‌ తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 83వ ర్యాంకర్‌ సుమిత్‌ నగాల్‌ 3–6, 3–6తో ప్రపంచ 564వ ర్యాంకర్‌ యిబింగ్‌ వు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 

79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్‌ తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశాడు. కేవలం రెండు విన్నర్స్‌ కొట్టిన నగాల్‌ ఎనిమిది అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 23,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 52 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తర్వాత నగాల్‌ గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. 

స్వీడన్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడాల్సిన సమయంలో నగాల్‌ వెన్నునొప్పి కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. నగాల్‌ గైర్హాజరీ అంశం వివాదాస్పదమైంది. డేవిస్‌ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాలంటే 50 వేల డాలర్ల వార్షిక ఫీజు తనకు చెల్లించాలని నగాల్‌ డిమాండ్‌ చేసినట్లు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఆరోపించింది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)