ఆసియాక‌ప్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. పాక్‌తోనే తొలి మ్యాచ్‌

Published on Sun, 07/07/2024 - 11:22

మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టుకు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నుండ‌గా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నుంది. 

ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల‌తో త‌ల‌ప‌డుతున్న భార‌త జ‌ట్టునే దాదాపుగా సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెట‌ర్ల‌ను సెల‌క్ట‌ర్లు కొన‌సాగించారు. ఇక ఈ టోర్న‌మెంట్‌లో భార‌త్ గ్రూపు-ఎలో పాకిస్తాన్‌, యూఏఈ, నేపాల్‌తో పాటు ఉంది. 

భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో జూలై 19న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భార‌త‌ జట్టు జూలై 21న యూఏఈతో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత త‌మ చివ‌రి గ్రూపు మ్యాచ్‌లో జూలై 23న నేపాల్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్‌ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.

ఆసియాకప్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్

రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)