Breaking News

అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్‌

Published on Sat, 08/10/2024 - 04:31

కుస్తీ క్రీడలో బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది.  వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్‌  విభాగంలో ఈసారి భారత్‌ నుంచి అమన్‌ సెహ్రావత్‌ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్‌ తనలో ఒలింపిక్‌ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్‌ కాంస్యంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో ఆరో పతకం చేరింది.

పారిస్‌: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో అమన్‌ 13–5 పాయింట్ల తేడాతో డారియన్‌ టోయ్‌ క్రూజ్‌ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. 

అండర్‌–23 విభాగంలో ప్రపంచ చాంపియన్‌ అయిన 21 ఏళ్ల అమన్‌ భారత్‌ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్‌ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్‌ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్‌ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 

రెండో భాగంలోనూ అమన్‌ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.  

7 ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్‌ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్‌ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్‌ కుమార్‌ (2008 బీజింగ్‌; కాంస్యం... 2012 లండన్‌; రజతం), యోగేశ్వర్‌ దత్‌ (2012 లండన్‌; కాంస్యం), సాక్షి మలిక్‌ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్‌ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)