Breaking News

మహిళ జట్టు సత్తా చాటేనా!

Published on Sun, 12/15/2024 - 03:57

ముంబై: ఆ్రస్టేలియా చేతిలో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐదు రోజుల వ్యవధిలోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్‌ పర్యటనకు వ చ్చిన వెస్టిండీస్‌ అమ్మాయిల జట్టుతో సొంతగడ్డపై నెగ్గే ప్రయత్నంలో సాధన చేస్తోంది. రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ముందుగా భారత్, విండీస్‌ జట్ల మధ్య నేడు తొలి టి20 జరగనుంది. 

జట్టులో కొరవడిన నిలకడ, అనుభవజ్ఞుల బాధ్యతా రాహిత్యం, బ్యాటర్ల ఫామ్‌ లేమి హర్మన్‌ప్రీత్‌ సేనను కలవరపెడుతోంది. స్టార్‌ ఓపెనర్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన చాన్నాళ్ల తర్వాత సెంచరీతో టచ్‌లోకి వచ్చిoది. అయితే ఈ ఫామ్‌ ఇకపై కొనసాగిస్తుందో లేదో  కరీబియన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తెలుస్తుంది. కెప్టెన్    హర్మన్‌ప్రీత్‌ మాత్రం వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. 

వరల్డ్‌ కప్‌ తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి టి20 సిరీస్‌ ఇదే కానుంది. ఆ్రస్టేలియా లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన చివరి వన్డేలో 4 వికెట్లతో చెలరేగినా... హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి జట్టులో స్థానం కోల్పోయింది. ఆతిథ్య జట్టు పరిస్థితి ఇలా ఉంటే వెస్టిండీస్‌ అమ్మాయిల జట్టు మనకంటే మెరుగనే చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో కెపె్టన్‌ హేలీ మాథ్యూస్, క్వియానా జోసెఫ్, డియాండ్రా డాటిన్, షెమైన్‌ క్యాంప్‌బెల్‌ ఫామ్‌లో ఉన్నారు. 

ఈ ఏడాది టి20 ఫార్మాట్‌లో కరీబియన్‌ టీమ్‌ 13 మ్యాచ్‌లాడితే తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే నవంబర్‌ 2019నుంచి భారత్, విండీస్‌ మహిళల జట్ల మధ్య ఎనిమిది టి20లు జరిగితే అన్నింటిలో భారతే విజయం సాధించడం విశేషం.  

జట్లు (అంచనా) 
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్‌. 
వెస్టిండీస్‌ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్‌ (కెప్టెన్ ), షెమైన్‌ క్యాంప్‌బెల్, ఆలియా అలెన్, షమిలియా కానెల్, డియాండ్ర డాటిన్, అఫి ఫ్లెచర్, నెరిసా, క్వియానా జోసెఫ్, హెన్రీ, జైదా జేమ్స్, కరిష్మా రమ్హారక్‌. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)