Breaking News

సిరీస్‌ విజయంపై గురి

Published on Sun, 01/12/2025 - 02:34

రాజ్‌కోట్‌: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్‌ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్‌పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో ప్రతీక రావల్, తేజల్‌ హసబ్నిస్‌ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. 

శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్‌లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్‌ ఫామ్‌ కొనసాగించాలని చూస్తోంది. 

గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే టిటాస్‌ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.

ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్‌ బెంచ్‌ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్‌ అదే జోష్‌లో సిరీస్‌ సమం చేయడంతో పాటు... భారత్‌పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)