Breaking News

భారత మహిళల రగ్బీ జట్టుకు కాంస్యం

Published on Mon, 08/11/2025 - 04:27

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా రగ్బీ మహిళల అండర్‌–20 సెవెన్‌–ఎ–సైడ్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 12–5 పాయింట్ల తేడాతో ఉజ్బెకిస్తాన్‌ జట్టును ఓడించింది. భారత జట్టు తరఫున భూమిక శుక్లా 7 పాయింట్లు, గురియా కుమారి 5 పాయింట్లు స్కోరు చేశారు. ఉజ్బెకిస్తాన్‌ తరఫున హుల్కర్‌ ఒలెమ్‌బెర్గనోవా 5 పాయింట్లు సాధించింది.

అంతకుముందు లీగ్‌ దశలో భారత జట్టు కజకిస్తాన్, యూఈఏ జట్లపై గెలిచి హాంకాంగ్‌ చేతిలో ఓడిపోయి తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన హాంకాంగ్‌ తొలి స్థానంలో నిలిచి భారత్‌తోపాటు సెమీఫైనల్‌ చేరుకుంది. మరో గ్రూప్‌ నుంచి చైనా, ఉజ్బెకిస్తాన్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్స్‌లో భారత్‌ 7–28తో చైనా చేతిలో, ఉజ్బెకిస్తాన్‌ 5–24తో హాంకాంగ్‌ చేతిలో ఓడిపోయాయి.  ఫైనల్లో చైనా 29–21తో హాంకాంగ్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)