Breaking News

భారత్‌ భారీ విజయం

Published on Sat, 09/06/2025 - 04:11

హాంగ్జౌ (చైనా): ప్రపంచ కప్‌ బెర్త్‌ సాధించడమే లక్ష్యంగా... ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నీలో బరిలోకి దిగిన భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్‌లాండ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని టీమిండియా 11–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముంతాజ్‌ ఖాన్‌ (7వ, 49వ నిమిషాల్లో), ఉదిత (30వ, 52వ నిమిషాల్లో), బ్యూటీ డుంగ్‌డుంగ్‌ (45వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు. 

సంగీత కుమారి (10వ నిమిషంలో), నవ్‌నీత్‌ కౌర్‌ (18వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (18వ నిమిషంలో), షర్మిలా దేవి (57వ నిమిషంలో), రుతుజా (60వ నిమిషంలో) టీమిండియాకు ఒక్కో గోల్‌ అందించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత జట్టు విరామ సమయానికి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవరాల్‌గా తమకు లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లలో ఐదింటిని గోల్స్‌గా మలిచిన భారత జట్టు నాలుగింటిని వృథా చేసింది. 

మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌ జట్టుకు ఒక్క పెనాల్టీ కార్నర్‌ కూడా దక్కలేదు. పూల్‌ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్‌ 9–0తో సింగపూర్‌ జట్టును ఓడించగా... పూల్‌ ‘ఎ’లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియా 9–0తో చైనీస్‌ తైపీపై, చైనా 8–0తో మలేసియాపై విజయం సాధించాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జపాన్‌తో భారత్‌; థాయ్‌లాండ్‌తో సింగపూర్‌ తలపడతాయి.    

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)