Breaking News

నెదర్లాండ్స్‌కు భారత్‌ షాక్‌

Published on Wed, 02/26/2025 - 03:46

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్‌’లో 2–1 గోల్స్‌ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌  నెదర్లాండ్స్‌ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ జట్టుపై గెలిచింది. 

నెదర్లాండ్స్‌ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్‌ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్‌ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్‌ కౌర్‌ (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. నెదర్లాండ్స్‌ జట్టుకు పియెన్‌ సాండర్స్‌ (17వ నిమిషంలో), వాన్‌డెర్‌ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. 

నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో భారత గోల్‌కీపర్‌ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్‌ క్రీడాకారిణుల షాట్‌లను నిలువరించింది. నెదర్లాండ్స్‌ తరఫున మరీన్‌ వీన్‌ మాత్రమే సఫలమైంది. భారత్‌ తరఫున దీపిక, ముంతాజ్‌ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్‌ కౌర్‌ విఫలమయ్యారు. 

నెదర్లాండ్స్‌ ఐదో షాట్‌ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్‌ను తీసుకోలేదు. ఇంగ్లండ్‌ తో పోరులో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్‌ అందించాడు. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)