Breaking News

చైనానూ చుట్టేసి...

Published on Sun, 11/17/2024 - 03:54

రాజ్‌గిర్‌ (బిహార్‌): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్‌ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. 

మూడో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్‌ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో జపాన్‌ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి.  

ఆరు జట్ల మధ్య లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. 

లీగ్‌లో టాప్‌ ర్యాంక్‌ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్‌ చేసి 2 గోల్స్‌ మాత్రమే సమర్పించుకుంది. 

మరోవైపు చైనా జట్టు 22 గోల్స్‌ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ         కొరియా  జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)