Breaking News

భారత్‌ X టోగో

Published on Sat, 02/01/2025 - 03:53

న్యూఢిల్లీ: డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌–1 ప్లే ఆఫ్స్‌లో భారత టెన్నిస్‌ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్‌లో టోగో జట్టుతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో శశికుమార్‌ ముకుంద్, రామ్‌కుమార్‌ రామనాథన్‌ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ–రిత్విక్‌ బొల్లిపల్లి, రివర్స్‌ సింగిల్స్‌లో శశికుమార్‌ ముకుంద్, రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ ఆడనున్నారు. 

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్‌లో జరగనున్న వరల్డ్‌ గ్రూప్‌–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్‌ ముకుంద్‌ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.

శ్రీరామ్‌ బాలాజీతో కలిసి అతడు డబుల్స్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్‌ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్‌తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్‌కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. 

శనివారం జరగనున్న తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో లివో అజావోన్‌ (టోగో)తో శశికుమార్‌ ముకుంద్, థామస్‌ సెటోజీ (టోగో)తో రామ్‌కుమార్‌ రామనాథన్‌ తలపడనున్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)