Breaking News

ఖోఖో ప్రపంచకప్‌: సెమీస్‌లో భారత జట్లు

Published on Sat, 01/18/2025 - 04:12

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దేశీయ క్రీడలో దుమ్మురేపుతున్న మన జట్లు క్వార్టర్స్‌లో అదే ఆధిపత్యం కనబర్చాయి. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 109–16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 

వరుసగా ఐదో మ్యాచ్‌లో 100 పాయింట్లకు పైగా స్కోరు చేసిన మన అమ్మాయిలు... ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్‌ ప్రియాంక ఇంగ్లె, నస్రిన్‌ షేక్, ప్రియాంక, రేష్మ రాథోడ్‌ సత్తా చాటారు. 

ఇతర క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఉగాండా 71–26 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, దక్షిణాఫ్రికా 51–46 పాయింట్ల తేడాతో కెన్యాపై, నేపాల్‌ 103–8 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాయి. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో ఉగాండాతో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతాయి.  

పురుషుల క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 100–40 పాయింట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. రామ్‌జీ కశ్యప్, ప్రతీక్, ఆదిత్య విజృంభించడంతో తొలి రౌండ్‌లోనే 58 పాయింట్లు సాధించిన భారత్‌... చివరి వరకు అదే జోరు కొనసాగించింది. 

రెండో రౌండ్‌లో తీవ్రంగా పోరాడిన శ్రీలంక ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది. ఇతర మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 58–38తో ఇంగ్లండ్‌పై, నేపాల్‌ 67–18తో బంగ్లాదేశ్‌పై, ఇరాన్‌ 86–18తో కెన్యాపై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాయి. నేడు జరగనున్న సెమీఫైనల్స్‌లో ఇరాన్‌తో నేపాల్, దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడతాయి.  

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)